ఫెస్టివల్ ఆఫర్‌లో ఆన్‌లైన్ షాపింగా... కొంపలు మునిగిపోతాయ్ జాగ్రత్త!

పండగలు, పబ్బాలు వచ్చాయంటే చాలు, అవి జనాలకు తాకక ముందే ఆన్లైన్ సేల్స్( Online Sales ) జనాలను క్యాష్ చేసుకోవడానికి సిద్ధపడిపోతాయి.అవును, సీజన్ ఇలా మొదలవుతుందో లేదో గాని, “ఆఫర్లండోయ్.

 Be Alert From Fake Deals And Offers During Festive Sales, Fake Deals And Offer,f-TeluguStop.com

ఆఫర్లు.ఒకటి కొంటే ఒకటి ఫ్రీ! 1000 రూపాయల వస్తువు కేవలం 100కే సొంతం చేసుకోండి.

” అంటూ.ఆన్‌లైన్‌లో అనౌన్స్ చేసి కస్టమర్లను ఊరిస్తారు.

ఇంకేముంది, కట్ చేస్తే మనం గొర్రెల్లాగా ముందూ వెనకా ఆలోచించుకోకుండా ఆర్డర్స్ పెట్టేస్తూ వుంటాం.అయితే ఇక్కడ వ్యాపార గిమ్ముక్కులు తెలుసుకోకపోతే అంతే సంగతి! మరి ఆ సంగతులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Telugu Amazon, Buyhatke Chrome, Commerce Sites, Deals, Offers, Festival Offers,

ముఖ్యంగా దసరా, సంక్రాంతి సీజన్లో భాగంగా. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్( Amazon,Flipkart ) వంటి ఇ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు పెట్టి కస్టమర్లను రారా అని పిలుస్తూ వుంటాయి.ఇప్పుడు కూడా అదే జరిగింది.ఇక పైన కూడా అదే జరుగుతుంది.అవును, అమాయక మధ్యతరగతి జనాలను క్యాష్ చేసుకునే పనిలో ఆన్‌లైన్‌ సంస్థలు నిమగ్నం అయ్యాయి.ఇప్పటికే.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ “బిగ్ బిలియన్ డేస్”( Big Billion Days ) పేరుతో ఆఫర్ల పండగకు తెరలేపాయి.ఈ సేల్స్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే.

ఈపాటికే మనం ఎన్నో వస్తువులు బుక్ చేసుకొనే పనిలో పడివుంటాం.లేదంటే ఇంకా ప్లాన్ చేసుకుంటాం.

పండగ సీజన్( Festive offers ) ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇవి టీవీల నుండి మొదలుకొని వాషింగ్ మిషిన్స్‌ నుండి గృహోపకరణాల వరకు అన్నింటిపైనా ఊహకందని ఆఫర్స్‌తో కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.దీంతో.

చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లు చేసేస్తున్నారు.ఫెస్టివల్ సీజన్లో తక్కువ ధరకు వస్తాయనే ఉద్దేశ్యంతో చాలా రోజుల నుంచి వెయిట్ చేసినవాళ్లు కూడా వుంటారు పాపం.

Telugu Amazon, Buyhatke Chrome, Commerce Sites, Deals, Offers, Festival Offers,

అయితే.అవి ఒరిజినల్ ఆఫర్లు అని తెలుసుకున్న తర్వాతనే మనం ఆర్డర్ పెట్టాలి.మరో ముఖ్యమైన విషయం ఏమంటే.అఫీషియల్ సైట్లు( Official Sites ) కూడా ప్రకటిస్తున్న ఆఫర్లు నిజమైనా? కాదా? అని తెలుసుకోవాలి.అదేవిధంగా వాళ్లు చెప్పినంత శాతం నిజంగానే ఆఫర్ ఇస్తున్నారా? ఆ వస్తువు అసలు ధర ఎంత? అనే వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.అయితే ఈ విషయం తెలుసుకోవాలంటే ఆన్లైన్లోనే తెలుసుకొనే వెసులుబాటు వుంది.

దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.మీ ఫోన్లో BuyHatke Chrome Extension ఓపెన్ చేసి, అందులో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువు ధరల హిస్టరీ చెక్ చేయండి.

దీని ద్వారా మీరు చాలా సులభంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్ లో ప్రకటించిన ఆఫర్లలో ఎంత శాతం నిజం ఉంది అనేది తెలిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube