సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీ

సూర్యాపేట జిల్లా:జిల్లాఎస్పీ రాజేంద్రప్రసాద్( SP Rajendra Prasad ) ను బుధవారం ఎన్నికల సంఘం బదిలీ చేసింది.ఎస్పీ బదిలీ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.

 Suryapet District Sp Rajendra Prasad Transferred , Sp Rajendra Prasad , Jagadish-TeluguStop.com

గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై ఎస్పీ మాట్లాడుతూ జయహో జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) అంటూ నినాదాలు చేస్తూ, అందరిచేత చేయిస్తూ, మంత్రి జగదీష్ రెడ్డిని బాహుబలితో పోలుస్తూ పొగడడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

జిల్లా ఎస్పీ అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను ఎన్నికల సంఘం బదిలీ చేయడంతో మళ్ళీ జయహో జగదీష్ రెడ్డి అంశం తెరమీదకు వచ్చింది.ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకొని రెండు సంవత్సరాలు కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube