తెలంగాణలో ఉద్యోగార్డులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పరీక్ష పేపర్ లీక్ ( TSPSC Paper Leak ) అయ్యింది అన్న వార్త తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది .
ప్రవీణ్ ( Praveen ) అనే అధికారి హనీ ట్రాప్ ద్వారా ఈ పేపర్లను మరొక మహిళకు అందించాడన్న వార్తలపై స్పందించిన ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దు చేసింది.అయితే ఈ విచారణ సమయంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయిందన్న సమాచారం ఉద్యోగస్తుల్ని అయోమయానికి గురిచేస్తుంది.
అసలే రాకరాక నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు ఈ కొత్త సమస్య ఏమిటంటూ పరీక్షకు సిన్సియర్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు.
ఇప్పుడు ఈ పరీక్ష ను కూడా రద్దు చేస్తే తమ భవిష్యత్తు ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
మళ్లీ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇప్పుడప్పుడే మళ్ళీ పరీక్షలు పెట్టడం కుదరదు.తమ తమ జీవితం నాశనం అయిపోతుందన్న అయోమయం చాలామందికి నిద్ర లేకుండా చేస్తుంది.
ప్రభుత్వం కూడా ఈ సమస్యని ఎలా డీల్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.ఇప్పుడు ఈ విషయంలోకి తెలంగాణ గవర్నర్( Telangana governor ) ఎంట్రీ ఇచ్చారు .ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో జరిగిన పరిణామాలు విచారణ విదానాన్ని సమగ్ర నివేదిక రూపంలో రెండు రోజుల్లోగా ఇవ్వాలని టిపిఎస్ఎస్సికి నోటీసులు ఇచ్చారు.

విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కావున బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మళ్లీమళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా, ఉద్యోగార్దులకు టీపీఎస్సీపై నమ్మకం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.ఎందరో జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి వ్యవహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సర్కారు వ్యవహరించిందని, నిరుద్యోగుల వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి

ఏది ఏమైనప్పటికీ ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాల విషయంలో నిర్వహణ ఈ స్థాయిలో ఉండటం మాత్రం కచ్చితంగా విమర్శించాల్సినవిషయమే .రేపు ఈ విషయంలో మనస్థాపానికి గురైన ఎవరైనా తనువు చాలిస్తే ఆ పాపం కచ్చితంగా టి పి ఎస్ ఎస్ సి మరియు ప్రభుత్వానికి తగులుతుంది.ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించి దోషులను శిక్షించడమే కాక అసలైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.