భారత సంతతికి చెందినా గీతా గోపీనాద్ కి అమెరికాలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనామిస్ట్ గా నియమిస్తూ ఎంతో గుర్తింపు ఇచ్చారు.ఈ ఘనత సాధించిన భారతీయ మహిలలో ఆమె మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం ఉన్న మౌరీ అబ్టాఫెల్డ్ డిసెంబర్ లో రిటెర్మెంట్ కానున్నారు దాంతో ఆయన స్థానంలో గీతా గోపీనాథ్ ని ఈ అత్యున్నత పదవిలో నియమించడం జరిగింది అయితే
గీతా గోపినాథ్ ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌ను, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో జాన్ జవాన్స్ట్రా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఆమె ప్రపంచలోనే అత్యంత ప్రతిభావంతమైన ఆర్దికవేత్తల్లో ఒకరు కావడం విశేషం.అంతేకాదు గీతా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పదవులని అలంకరించారు కూడా గీత అమెరికన్ ఎకానమిక్ రివ్యూకి కో-ఎడిటర్‌గా , నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ రీసెర్చ్‌లో మాక్రో ఎకానమిక్స్ ప్రొగ్రామ్‌కు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌కు కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆర్ధికపరమైన సంక్షోభాల పై సుమారు 40 పరిశోధన ఆర్టికల్స్‌కు ఆమె రచనలు చేశారు అవి ఎంతో పాపులర్ రచనలు కూడా అయ్యాయి…ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ తీసుకున్న గీతా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పొందారు.ఒక భారతీయ మహిళ ఇన్ని రంగాలలో విశేష సేవలు అందిస్తూ గుర్తింపు పొందట భారతీయులు అందరూ ఎంతో గర్వించతగ్గ విషయమని అంటున్నారు భారతీయ ఎన్నారైలు.