తన్నినా .. తిట్టినా ఆయనకే చెల్లు ! జై బాలయ్య తప్పు వారిదే !

కొంతమంది మీద ఎన్ని విమర్శలు వచ్చినా… వివాదాలు వచ్చినా ఏమాత్రం సరిదిద్దుకోరు.పైగా అది తమ హీరోయిజం అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు.

 Nandamuri Balakrishna Slaps His Fans In Khammam Tour1-TeluguStop.com

తాము తన్నినా .కొట్టినా అంతా లోక కళ్యాణం కోసమే అన్నట్టు కలరింగ్ ఇస్తుంటారు.ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో ఎప్పుడో చేరిపోయాడు హిందూపురం ఎమ్యెల్యే ప్లస్ సినీ నటుడు బాలయ్య.తన అభిమానుల మీద వీర ప్రతాపం చూపిస్తూ మీడియా కు ఎక్కడం బాలయ్యకు బాగా అలవాటయ్యింది.

తెలంగాణ టీడీపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న బాలయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఖమ్మం వచ్చాడు.అసలు మహాకూటమిలో సీట్లు, పొత్తులే ఇంకా ఒక కొలిక్కి రాలేదు అయినా అప్పుడే ఆ పొత్తులో భాగంగా సత్తుపల్లి టికెట్ సండ్ర వెంకట వీరయ్యకు ఇచ్చేసినట్టు బాలయ్య ముందస్తు ప్రచారానికి వచ్చేసాడు.బాలయ్య అంటే ఆషామాషీ వ్యక్తా.? అర్ధమయ్యి కానీ రీతి లో ఎదో మాట్లాడినా ఫ్యాన్స్ మాత్రం జై బాలయ్య అంటూ రెచ్చిపోతుంటారు.ఆ రెచ్చిపోతూనే బాలయ్య చేతిలో తన్నులు కూడా తినేస్తుంటారు.

ఖమ్మం జిల్లాలో పర్యటించిన బాలయ్య నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద బాలకృష్ణ కాన్వాయ్ వస్తుండగా నలుగురు అభిమానులు ఆయనను అడ్డగించి చేతులు కలిపేందుకు ప్రయత్నించారు.ఇంకేముంది అసలే ముక్కుమీద కోపంతో ఉండే బాలయ్య వాహనం దిగి మరీ వారిపై చేయే కాదు కాలు కూడా చేసుకున్నారు.

ఇంకేముంది మమ్మల్నే తన్నుతారా అంటావు ఆగ్రహించిన బాలయ్య అభిమానులు ఆయన ఫ్లెక్సీని తగులపెట్టారు.

బాలయ్య వ్యక్తిగతంగా మంచి వారే.అందులో ఎవరికీ డౌట్ లేదు.ఆయన షార్ట్ టెంపరే కొంప ముంచుతోంది.

ఇక తెలంగాణా టీడీపీ నాయకుల పరిస్థితి చూడాలి … తమకేదో కలిసొచ్చేలా బాలయ్య ప్రచారం చేస్తాడు అనుకుంటే అసలుకే ఎసరుపెట్టేలా ఉన్నాడని లబోదిబోమంటున్నారు.అయినా ఇక్కడ ఫ్యాన్స్ తప్పు కూడా కనిపిస్తుంది.

బాలయ్య గురించి తెలిసినా … ఆయన చేతిలో అభిమానులు దెబ్బలు తిన్నా … అవేమి గుర్తుపెట్టుకోకుండా కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా బాలయ్య కు మరీ అంత దగ్గరగా వెళ్లడం నిజంగా ఫ్యాన్స్ తప్పే.అంతకుముందు ఆంధ్రాలో ఒక నాయకుడు చెప్పినట్టు బాలయ్య చెయ్యి పడితే అదృష్టంగా భావించాలి తప్ప ఇలా రచ్చ చేసుకోవడం తగదు.

ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం మారాడు … ఆయన అంతే … జై బాలయ్య !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube