గని భామ అతనితో డేటింగ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్.నటుడు డైరక్టర్ మహేష్ మంజ్రేకర్ డాటర్ అయిన సయి మంజ్రేకర్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 సినిమాలో నటించి మెప్పించింది.

 Ghani Heroine Saiee Manjrekar Dating With Bollywood Producer Son Details, Saiee-TeluguStop.com

తెలుగులో వరుణ్ తేజ్ గని సినిమాతో పాటుగా అడివి శేష్ మేజర్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది.ఈ రెండు సినిమాలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే గని భామ సయి మంజ్రేకర్ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ నిర్మాత షాజిద్ నదియావాలా తనయుడు శుభాన్ తో సయి మంజ్రేకర్ ప్రేమలో పడినట్టు టాక్.

త్వరలోనే శుభాన్ నదియావాలా డైరక్టర్ గా మారబోతున్నాడు.అయితే ఇన్నాళ్లు ప్రొడక్షన్ పనులను చూసుకున్న శుభాన్ డైరక్టర్ గా మారడానికి ముందే హీరోయిన్ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే శుభాన్, సయి మంజ్రేకర్ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తుంది.శుభాన్ తో సయి మంజ్రేకర్ డేటింగ్ లో ఉందని ముంబై మీడియా కోడై కూస్తుంది.

మరి వీరి లవ్ స్టోరీ పెళ్లి దాకా వెళ్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube