ఎలియన్స్ ఉన్నాయి... అదిగో సాక్ష్యం!

ఈ భూమి మీద కాకుండా ఇతర గ్రహాలలో జీవరాశులు ఉన్నాయా… అవి మనుషులతో సంబంధాలు కోరుకున్తున్నాయా అంటే ఇప్పటికి అది అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది అని చెప్పాలి.అయితే ఎలియన్స్ జాడ ఉందని అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.

 Flying Saucer Identified In Shuttle Atlantis-TeluguStop.com

వాటి ఉనికి ఏదో ఒక రోజు తెలుసుకుంటామని చెబుతున్నారు.అప్పుడప్పుడు ఎలియన్స్ వాటికి సంబందించిన సిగ్నల్స్ మనకి పంపిస్తున్నాయని అంటున్నారు.

అలాగే ఎగిరే పల్లెలుగా చెప్పుకునే ఎలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు.మరో సారి అలాంటి వాదనని ఎలియన్స్ మీద పరిశోధనలు చేసే ప్రైవేట్ వెబ్‌సైట్ యూఎఫ్ఓ సైటింగ్స్ డైలీ చెబుతుంది.

భూమి చుట్టూ తిరుగుతున్న షటిల్ అట్లాంటిస్ కింద ఎగిరే పళ్లెం ఉందని ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు స్కాట్ వారింగ్ చెబుతున్నారు.దీన్ని నాసా ఓ శాటిలైట్ అని చెబుతున్న ఇలాంటి ఫొటోల్లో తాను మరిన్ని ఎగిరే పళ్లేలను కనిపెట్టానని స్కాట్ చెబుతున్నారు.

ఈ ఎగిరే పళ్లేన్ని నాసా తప్పుగా శాటిలైట్ అని చెబుతోందనీ… షటిల్ అట్లాంటిస్ చుట్టూ చాలా యూఎఫఓలు తిరిగిన విషయం యూఫాలజిస్టులు అందిరికీ తెలుసని ఆయన అంటున్నారు.ఈ ఎగిరే పళ్లాల వల్లే అట్లాంటిస్ షటిల్ ల్యాండిగ్ ఆలస్యమైందనీ.

అన్ని యూఎఫ్ఓలు వెళ్లిన తర్వాతే షటిల్‌ను ల్యాండ్ చేశారని అంటున్నారు.అయితే అతని వాదనని నాసా మాత్రం కొట్టి పారేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube