సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అన్నవి కామన్.ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.
కొందరు విడాకులు తీసుకొని విడిపోయిన వారు మరొక పెళ్లికి సిద్ధమవుతున్నారు.మరికొంతమంది ఏళ్ల తరబడి రిలేషన్ షిప్ లో ఉంటూ పెళ్లి వరకు వచ్చేసరికి బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు విడాకులు తీసుకొని వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు.ఇలా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకొని విడిపోతుండడంతో నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అలా ఇటీవల సినిమా రంగంలో విడాకుల కల్చర్ విపరీతంగా పెరిగింది.
హృతిక్ రోషన్-సుహానే ఖాన్, అమీర్ ఖాన్-కిరణ్ రావ్, నాగ చైతన్య( Naga Chaitanya )సమంత( Samantha ) ధనుష్-ఐశ్వర్య, నిహారిక జొన్నలగడ్డ చైతన్య లాంటి సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయం అభిమానుల్లో తీవ్ర కలవర పాటుకు గురి చేసింది.తాజాగా మెగా కుటుంబ వారసురాలు నిహారిక, చైతన్యలు కూడా విడిపోయినట్లు ప్రకటించారు.
అంతలోనే కలర్ స్వాతి, ఆశిన్ వంటి నటీమణులు కూడా ఇదే వరుసలో ఉన్నట్లు వార్తలు రాగా ఆ గాసిప్స్‌కు చెక్ పెట్టేశారు.తాజాగా కన్నడ నటి, యాంకర్ అయిన చైత్ర వాసుదేవన్ ఐదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్థి పలికినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్దీన్ ఖాన్( Fardeen khan )ఆయన భార్య నటాషా మద్వానీ( Natasha madhvani ) విడాకులు తీసుకున్నారని ఓవార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.నటాషా ప్రముఖ బాలీవుడ్ నటి ముంతాజ్ కూతురు.పర్దీన్-నటాషా 2005 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.వీరికి దియాని ఇసబెల్లా ఖాన్ 10 అజారియస్ ఫర్దీన్ ఖాన్ 6అనే కుమారుడు ఉన్నారు.వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో ఏడాది నుండి విడివిడిగానే ఉంటున్నారట.
పర్దీన్ తన తల్లితో కలిసి ముంబయిలో ఉండగా నటాషా మాత్రం లండన్‌లో నివస్తోంది.ఇద్దరి మధ్య గొడవలు తట్టుకోలేని స్థాయికి వెళ్లడంతో పాటు పరిష్కరించుకోలేని దశలో ఉండటంతో విడిపోవడమే బెటర్ అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.
త్వరలోనే వీరు వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారని తెలుస్తోంది.ఈ జంట 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారు.