జైపూర్ నుంచి ముంబై వెళ్లే రైలులో కాల్పుల కలకలం చెలరేగింది.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ అనే వ్యక్తి ప్రయాణికులపై ఇష్టారీతిన కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.ఉదయం ఐదు గంటల సమయంలో దహీసర్ స్టేషన్ దగ్గర బీ5 కోచ్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
కాల్పులు జరిపిన అనంతరం చేతన్ సింగ్ ట్రైన్ నుంచి బయటకు దూకేశాడు.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితుడు చేతన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బోరివలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.చేతన్ సింగ్ అరెస్ట్ తరువాత రైలు యథావిథిగా నడిచింది.