ఈ మధ్య కాలంలో దొంగలు( Thieves ) వారి పని కానిచ్చేయడానికి రకరకాల కోర్సులు చేస్తున్నట్లుంది.అందివచ్చిన ఆధునిక టెక్నాలజీతో దర్జాగా దోచుకుంటున్నారు జనాలని.
సాధారణంగా ఏటీఎం చోరీ( ATM Robbery ) చేయడం అంటే దొంగలకు అంత తేలికైన పని కాదు.దొంగతనం చేసే సమయంలో ఎవరి కంట పడకుండా ఉండేందుకు వారు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.
దాంతో వీరు ఓ కొత్త ఆలోచన చేసారు.అవును, తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఏటీఏం చోరీ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

నల్లగొండ జిల్లా ( Nalgonda ) కట్టంగూరు మండలం ఐటిపాములలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ప్రజా అవసరాల నిమిత్తం ఎస్బిఐ( SBI ) అక్కడ ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది.ఒకటికాదు… ఈ సెంటర్ లో రెండు ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.అయితే ఒకరోజు, దొంగలు ఏకంగా ఈ ఏటీఎంపై కన్నేశారు.ఇంకేముంది ప్రణాళిక రచించి అమాంతం దోచేశారు.వ్యాన్ లో వచ్చిన ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి సరిగ్గా అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించారు.తమ దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండడానికి దొంగలు ఏటీఎంలోకి రాగానే సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రేను జల్లేశారు.
ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఆ తరువాత గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంను కట్ చేసి డబ్బులు దోచుకెళ్లిపోయారు.ఈ క్రమంలో రెండు ఏటీఎంలో కలిపి ఏకంగా 30 లక్షల నగదుని( 30 Lakhs ) చోరీ చేసినట్టు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.బ్యాంకు మేనేజర్ వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు.
ఈ చోరీకి ముగ్గురు దుండగులు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డు కావడం పోలీసులు కనుగొన్నారు కానీ, వారిగురించి సరియైన సమాచారం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.కాగా.ఇదే మాదిరిగా 8 నెలల క్రితం కేతేపల్లి ఏటీఎంలో కూడా చోరీ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు.ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.







