మెహబూబా సినిమా తో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ పూరి కెరీర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లతో దూసుకు పోవడం లేదు.తండ్రి ఎంతో మంది హీరోలను స్టార్స్ గా చేశాడు.
అందుకే తండ్రి దర్శకత్వంలో ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.ఇప్పుడు ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాధ్ పరిస్థితి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది.
లైగర్ సినిమా దారుణంగా నిరాశ పర్చిన కారణంగా పూరి జగన్నాధ్ తో సినిమాను చేసేందుకు ఏ ఒక్క హీరో కూడా ఆసక్తి చూపడం లేదట.దాంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.
మరో వైపు ఆకాష్ పూరి కూడా ఈమధ్య కాలంలో రొమాంటిక్ మరియు చోర్ బజార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.
కొడుకు కోసం ఒక మంచి కథను రెడీ చేసి పూరి సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో హీరోను పట్టుకుని.చేతిలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోను పెట్టుకుని ఎందుకు పూరి జగన్నాధ్ బయట చూస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రముఖంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది.
తనయుడు ఆకాష్ తో సినిమా ను తీసి సక్సెస్ కొడితే బయట హీరోలు మళ్లీ పూరి జగన్నాధ్ ముందు క్యూ కడతారు కదా అనేది చాలా మంది అభిప్రాయం.ఇప్పటి వరకు చిన్న పూరి కెరీర్ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అని చాలా మంది భావించారు.
కానీ తండ్రి పట్టించుకోక పోతే మరెవ్వరు పట్టించుకుంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు కాకున్నా వచ్చే ఏడాదిలో అయినా ఆకాష్ తో పూరి జగన్నాధ్ మూవీ ఉంటుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.