ఎలాన్ మస్క్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మాస్క్ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెర లేపుతూ అచ్చం మన వివాదాల వర్మ మాదిరి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అవును, వ్యాపార ప్రపంచంలో ఎన్నో విజయాలు అందిపుచ్చుకున్న ఎలాన్ మాస్క్ గతేడాది ట్విట్టర్ కొనుగోలు చేసి, సంచలనం సృష్టించిన సంగతి విదితమే.కాగా ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేసి, అందరి దృష్టిని ఆకర్శించారు.
ఈ క్రమంలో వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగించారు కూడా.
ఇక కొన్నాళ్ల క్రితం ఎలాన్ మస్క్ కొత్త CEO కోసం వెతుకుతున్నానని చెప్పగా అది కాస్త పెద్ద న్యూస్ అయింది.ఈ క్రమంలోనే మస్క్ మరోసారి తన తిక్కని ప్రదర్శించారు.ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేధికగా తాజాగా తెలిపారు.
కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే సృష్టిస్తోంది.ఎలాన్ మాస్క్ మొదటి నుంచి వ్యంగ్యమైన ట్వీట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కాంట్రవర్సీలకు తెరలేపుతుంటారు.
ఆ రకంగానే తన పెంపుడు కుక్క ఫోల్కీనే ట్విట్టర్ తాజా CEO అంటూ మస్క్ చేసిన ట్వీట్ ఇపుడు తెగ వైరల్ అవుతోంది.
సదరు పోస్ట్ చూస్తే… ఆయన పెంపుడు శునకం CEO లోగోతో ఉన్న షర్ట్ ధరించి ఎంచక్కా కుర్చీలో కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు.దానిని పోస్ట్ చేసిన మాస్క్ ‘ట్విట్టర్ కొత్త సీఈవొ ఓ అద్బుతం’ అంటూ పోస్ట్ చేశాడు.అంతేకాకుండా ట్విట్ లో ‘ఇతర వ్యక్తి కంటే చాలా మంచిది’, ‘అతను ఉద్యోగం కోసం పర్ఫెక్ట్’ అంటూ కామెంట్స్ చేయడం కొసమెరుపు.
అంటే దానర్ధం గతంలో చేసిన CEOల కన్నా తన పెంపుడు కుక్క చాలా బెటర్ అంటూ పరాగ్ అగర్వాల్ కి పరోక్షంగా చురకలు అంటించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా గత ఏడాది 4 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేశారు ఎలాన్ మాస్క్.