ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం..!!

త్వరలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి.

 Election Commission Good News To Election States, Election Commission Of India,-TeluguStop.com

ప్రజలకు హామీల విషయంలో వరాలు కురిపిస్తున్నారు.ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో… ఎన్నికల వాతావరణం భీకరంగా ఉంది.

ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా ఉంది. బీజేపీ లేదా ఎస్పి మధ్య పోటా పోటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం గెలుపుపై ఫుల్ ధీమాగా ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల కరోనా కేసులు పెరగటంతో.

ఎక్కడ కూడా బహిరంగ సభలకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకుండా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయడం తెలిసిందే.ఇటువంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది.

మేటర్ లోకి వెళ్తే 1000 మందితో బహిరంగంగా సభలు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది.దేశ వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో… ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ నిర్ణయంతో రాజకీయా పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Election Commission Good News Telling To Election States Election Commission Of India, 5 State Elections - Telugu India

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube