విటమిన్ 'డి' లోపం వల్ల వచ్చే సమస్యలు

విటమిన్ డి అనేది మన శరీరానికి సహజంగా అందుతుంది.ఇది లోపించినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి.

 Effects Of Vitamin D Deficiency-TeluguStop.com

వాటిని ఎప్పటికప్పుడు గురించి పరిష్కారం చేసుకోవాలి.వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ డి శరీరానికి సరిగా అందకపోతే కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు వస్తాయి.ఈ నొప్పులు దీర్ఘ కాలంగా ఉంటే మాత్రం విటమిన్ డి లోపం ఉందేమో పరీక్ష చేయించుకోవాలి.

విటమిన్ డి లోపం కారణంగా శరీరానికి అవసరమైన క్యాలిష్యం సరిగా శరీరానికి అందదు.

విటమిన్ డి లోపం కారణంగా ఒత్తిడి,అలసట,నిస్సత్తువ ఏర్పడతాయి.

ఈ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి రోజు సూర్యోదయం,సూర్యాస్తమయం సమయంలో అరగంట పాటు గడపాలి.సరైన మోతాదులో విటమిన్ డి శరీరానికి అందితే మంచి ఉత్సాహం కలుగుతుంది.

విటమిన్ డి శరీరానికి సరైన స్థాయిలో అందినప్పుడు మేలు చేసే హార్మోన్ సెరోటోనిన్ విడుదల అవుతుంది.విటమిన్ డి లోపిస్తే ఈ హార్మోన్ విడుదల తగ్గుతుంది.తద్వారా మానసిక స్థితి మరియు భావోద్వేగాలు మారుతూ ఉంటాయి.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా చెమటలు పట్టటం, దురదగా చిరాకుగా ఉంటే విటమిన్ డి లోపంగా గుర్తించాలి.

ఈ సమస్యల నుండి బయట పడాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా పాలు, దానిమ్మ, నారింజ, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube