దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకోనున్నారు.ఈ మేరకు సిసోడియాను వారం రోజులపాటు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఈనెల 17 వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉండనున్నారు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో సిసోడియాను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు అధికారులు.
మరోవైపు సిసోడియా బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.