కోడిపిల్లలతో కుక్క సావాసం... ఈ వీడియో చూస్తే మీరు ఫిదా అవ్వడం ఖాయం..

సాధారణంగా మూగ జంతువుల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడితే అవి చనిపోయేంతవరకు ఫ్రెండ్లీగానే ఉంటాయి.మనుషుల్లాగా వెన్నుపోటు పొడవడాలు, మోసం చేయడాలు జంతువులకు చేతకాదు.

 Dog Living With Chicks  If You Watch This Video, You Will Definitely Get Fed Up-TeluguStop.com

అయితే కొన్ని జంతువులు తమ జాతి జంతువులతోనే కాకుండా ఇతర జంతువులతోనూ స్నేహం చేస్తుంటాయి.ముఖ్యంగా కుక్కలు ఇతర జీవులతో స్నేహం చేయడంలో ముందుంటాయి.

అయితే ఇప్పుడు ఒక కుక్క ఏకంగా కోడిపిల్లలతోనే సావాసం చేస్తోంది.సాధారణంగా కోడి పిల్లలను చూస్తేనే కుక్కలకు మహా చిరాకు వేస్తుంది.

శునకాలు వాటిని వెంటాడి మరీ పరిగెత్తాయి.అయితే ఈ కుక్క మాత్రం అన్ని కుక్కలకు విరుద్ధంగా కోడిపిల్లలను తన బిడ్డల్లాగా చూసుకుంటోంది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వాట్ ఏ ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అంటూ మైమర్చిపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క కోడిపిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయాలని చాలా ఆనందంగా ట్రై చేయడం చూడొచ్చు.

కానీ కోడి పిల్లల తల్లి ఆ కుక్కను చూసి బాగా భయపడి పోయింది.ఈ కుక్క తన పిల్లలకు ఏదైనా హాని తలపెడితుందేమోనని కోడిపిల్లల దాన్ని పిల్లల దగ్గరికి రానివ్వలేదు.

అయినా సరే కుక్క కోడి పిల్లలతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది.ఈ క్రమంలో కోడి కుక్కను పొడవడానికి కూడా ముందుకొచ్చింది.

కానీ కుక్క ఏమాత్రం భయపడకుండా చాలా సాఫ్ట్ గా ప్రయత్నిస్తూ తల్లిని మచ్చిక చేసుకొని పిల్లలతో స్నేహం ఏర్పరచుకుంది.అలా ఇది అనేక ప్రయత్నాలు చేసి కోడి పిల్లలను తన ఫ్రెండ్స్ చేసుకుంది.

ఈ వీడియో చివరిలో కుక్క వద్దకు కోడి పిల్లలు వాటంతటవే రావడం చూడొచ్చు.అంతేకాదు ఆ కోడిపిల్లలు కుక్కతో ఆడుకుంటూ ఆశ్చర్యపరిచాయి.

తల్లి కూడా కుక్క దగ్గరికి వచ్చి తన పిల్లలను ఆడిస్తూ మురిసిపోయింది.ఈ దృశ్యాలు చూసేందుకు చాలా క్యూట్ గా ఉన్నాయి.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube