ప్రవాసులకు బిగ్ షాక్ : కువైట్ మరో దిక్కుమాలిన రూల్...అదే అమలైతే...!!!

ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.ఇప్పటికే పలు రకాల ఆంక్షలతో, కొత్త కొత్త రూల్స్ తో ప్రవాసులను ముప్పు తిప్పలు పెడుతున్న కువైట్ తాజాగా మరో సరికొత్త రూల్ ను అమలు లోకి తీసుకువచ్చేందుకు సిద్దమవుతోందట.

 Big Shock For Expatriates Kuwait Is Another Perverse Rule If The Same Is Enforc-TeluguStop.com

ఇప్పటికే ఈ రూల్ కి చెందిన బిల్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చలు కూడా జరుతుతున్నాయని వినిపిస్తోంది.ఇంతకీ ఏమిటా కొత్త రూల్ అంటే కొత్త రూల్ కాదు చెత్త రూల్ అనే చెప్పాలి.

వివరాలలోకి వెళ్తే.

కువైట్ లో ప్రవాసుల సంఖ్య అన్ని దేశాలతో పోల్చితే ఎక్కువగానే ఉంటుంది.

ఇక్కడికి పనిచేయడానికి వచ్చే విదేశీయులు భారీగా పెరిగిపోవడంతో కువైట్ ప్రభుత్వం వారిని వదిలించుకోవడానికి అప్పుడప్పుడు రూల్స్ పేరుతో సాగనంపే ప్రయత్నం చేస్తుంది.ఈ క్రమంలోనే 2017 లోనే కువైటైజేషన్ ను తీసుకువచ్చి స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ కువైట్ లో ఉన్న ప్రవాసులను భారీ సంఖ్యలో సాగనంపింది, ఇప్పటికే ఈ విధానం కొనసాగుతూనే ఉంది.

అయితే తాజాగా కువైట్ ఎంపీ అల్ హమీది ప్రవాసుల నివాస చట్టం విషయంలో కొన్ని మార్పులు చేయాలని అందుకు తన వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని ప్రకటించారు.ఈ ప్రతిపాదనలు లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ ముందు ఉంచారు.

కువైట్ లో ప్రవాసులు ఎవరైనా సరే దీర్ఘకాలికంగా నరాలు, లేదా మానసిక వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే వారి రెసిడెన్సీ పర్మిట్లు నిలిపివేసి దేశం నుంచీ పంపేయాలని కోరారు.తన ప్రతిపాదన అందరికి ఆమోద యోగ్యంగానే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి మన కువైటీ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించానని ఆయన ప్రకటించారు.

కాగా ప్రస్తుతం ఈ ప్రతిపాదన పార్లమెంటరీ కమిటీల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.దీని ప్రకారం కువైట్ లో పనిచేసేందుకు ఇకపై ఎవరు వీసా దరఖాస్తుకు అప్ప్లై చేసినా సరే వారు తప్పనిసరిగా ఎలాంటి అంటువ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు, మానసిక రుగ్మతలు లేవని మెడికల్ టెస్ట్ రిపోర్ట్ లు జతచేయాలట.

ఒక వేళ ఇదే గనుకా అమలైతే ప్రవాసులకు ఇబ్బందులు తప్పవని ఎంత మంది దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందో అంచనా వేయలేమని అంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube