తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈయన చివరిగా ఎఫ్3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణ( Balakrishna ) తో చేస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాలో కమెడియన్ బ్రహ్మాజీ ( Brahmaji )కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో బ్రహ్మాజీ ప్రతి ఒక్క సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలావరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఏ విషయం అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే తాజాగా బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
ఈ వీడియోలో ఈయన కారు దిగి బయటకు రాగా అక్కడే ఉన్నటువంటి అనిల్ రావిపూడిని కలుస్తారు.అనిల్ రావిపూడి కూడా బ్రహ్మాజీని చూసి లేసి తనని హగ్ చేసుకోవడానికి వెళ్ళగా బ్రహ్మాజీ మాత్రం తన కాళ్లకు నమస్కారం చేస్తారు.దీంతో అనిల్ రావిపూడి అయ్యో మీరు నాకన్నా పెద్దవారు అనడంతో నేను మీ షూ ఏ బ్రాండ్ అని చూస్తున్నాను అంటూ బ్రహ్మాజీ సెటైర్ వేశారు.ఇక ఈ వీడియోని బ్రహ్మాజీ షేర్ చేస్తూ డైరెక్టర్ గారు మీరు కూడా ఆన్ బోర్డ్ ఏ.మాకు వెల్కమ్ లేదా?.నా పాన్ ఇండియన్ ఫ్యాన్స్‌కు ఇదే నా గ్లింప్స్ అంటూ ట్వీట్‌తో పాటుగా వీడియోను షేర్ చేశాడు.
ఈ వీడియో పై స్పందించిన అనిల్ రావిపూడి ఏ స్క్రిప్ట్ అయినా ఆఫీస్ బోర్డు మీద ఉన్నపుడే మీరు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ లో వుంటారు.మళ్ళీ మీకు సెపరేట్ గా ఆన్ బోర్డ్‌లు అవసరమా అంటూ రిప్లై ఇచ్చారు.