గతకొద్ది రోజులుగా అంతర్జాతీయ విమానాల్లో జరుగుతున్న అనుచిత ఘటనలు అందర్నీ నివ్వెరపరుస్తున్నాయి.విమానంలో ప్రయాణిస్తూ పక్కవారిపై మూత్రం పోయడం, వాగ్వాదానికి దిగడం, కొట్లాటకు కూడా పాల్పడటం వంటి ఘటనలు రీసెంట్ టైమ్స్‌లో వెలుగు చూశాయి.
ఇలా ప్రవర్తించడానికి కారణం వారు మద్యం పుచ్చుకోవడమేనని తెలిసింది.అయినా కూడా ఇప్పటికీ విమానాల్లో ఆల్కహాల్ సరఫరా చేస్తూనే ఉన్నారు.
నిజానికి ఏ పబ్లిక్ రవాణాలలో ఆల్కహాల్ సర్వే చేయరు.కానీ అంతర్జాతీయ విమానాల్లోనే దీన్ని ఎందుకు అనుమతించారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా విమానంలో ప్రయాణించే వారు దాదాపు ధనవంతులై ఉంటారు.వీరికి అన్ని సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత విమానాల సంస్థలకు ఉంది.ఈ సౌకర్యాలను అందించడం ద్వారా వాటి రెవిన్యూ కూడా పెరుగుతుంది.అందుకే విమాన సంస్థలు ఆల్కహాల్ కూడా అమ్మడం చేస్తుంటాయి.ఈ సంస్థలు ఎకనమీ, బిజినెస్ క్లాసులో ఆల్కహాల్ విక్రయిస్తూ వాటిపై ఎంతో కొంత ప్రాఫిట్ సొంతం చేసుకుంటుంటాయి.వ్యాపారం బాగా నడిచేందుకు ఆల్కహాల్ తమ విమానాల్లో ఫ్రీగా అందిస్తామని కొన్ని కంపెనీలు ప్రకటిస్తుంటాయి.
అయితే ఆల్కహాల్ ప్రైస్ అనేది టికెట్ ధరలోనే ఈ విమానాలు ఇంక్లూడ్ చేస్తాయి.అయితే ఆల్కహాల్ తప్పకుండా ఇంటర్నేషనల్ విమానాల్లో అందించాలనే రూలేం లేదు.
సాధారణంగా ఇంటర్నేషనల్ జర్నీలు చాలాసేపు కొనసాగుతాయి.ఇలాంటి సమయంలో వారు ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతారు.తర్వాత మత్తుగా నిద్ర పోవాలనుకుంటారు.అందుకు అనుగుణంగానే ఈ కంపెనీలు మద్యం సరఫరా చేస్తాయి.మద్యం తాగి నిద్ర పోవడం వల్ల వారు విమాన సిబ్బందిని ఎక్కువగా తమకు సేవలు చేయాలని అడగలేరు.దీనివల్ల ఫ్లైట్ సిబ్బందికి పని భారం తగ్గుతుంది.
అయితే విమానాల్లో ప్రయాణించేవారిలో కొందరు మితంగా మద్యం తాగితే మరికొందరు అధికంగా సేవిస్తుంటారు.ఇలా ఎక్కువగా తాగిన వారు విమానంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్లైట్ సిబ్బందికే ఉంటుంది.
వారిని కంట్రోల్ చేసేందుకు విమాన సిబ్బందికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు.ఇక మన దేశంలో డొమెస్టిక్ విమానాల్లో మద్యం తాగడానికి వీల్లేదు.
అయితే లిమిటెడ్ ఆల్కహాల్ బాటిల్స్ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.