టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాలో బిజీ కానున్నారు.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మహేష్ బాబు ఈయనకు సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఏడాదికి రెండు మూడు సార్లు మహేష్ బాబు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా మహేష్ బాబుకి షూటింగ్ లేకపోతే వెకేషన్లలో ఎంజాయ్ చేయడమే కాకుండా ఈయనకు మరో అలవాటు కూడా ఉందట.మహేశ్ బాబుకి ఏ మాత్రం పని లేకుండా ఖాళీగా ఉంటే కనుక ఈయన ఏదో ఒక బుక్ చేతిలో పట్టుకొని ఆ బుక్ చదువుతూ( Book Reading ) కూర్చుంటారు అంటూ తాజాగా మహేష్ బాబుకు సంబంధించి ఈ వార్త వైరల్ గా మారింది.
ఈయన ఏదైనా షూటింగ్లో ఉన్నా కూడా తన చేతిలో బుక్ ఉంటుందని తెలుస్తుంది ఇక జర్నీ చేసే సమయంలో కూడా ఫ్లైట్ లో కూడా ఖాళీగా కూర్చోకుండా తనకు ఇష్టమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారట.
మహేష్ బాబుకి షూటింగ్ లేకపోతే ముందు ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు .ఫ్యామిలీతో తన సమయం గడపడానికి ఇష్టపడతారు.ఫ్యామిలీ తర్వాత ఆయన ఎవరితోనైనా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు అంటే అది కేవలం పుస్తకాలు మాత్రమేనని ఈయన తన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండటం కోసమే ఇలా పుస్తకాలనింటిని చదువుతూ ఉంటారంటూ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా మహేష్ బాబు అలవాట్లు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.