బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరవ వారం ప్రసారం అవుతుంది.ఇక ఐదవ వారం ఊహించిన విధంగానే సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం చలాకి చంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చలాకి చంటి అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు.అయితే ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారని అందరూ భావించినప్పటికీ కేవలం ఐదు వారాల వరకు మాత్రమే హౌస్ లో కొనసాగారు.
చంటి ఐదవ వారం నామినేషన్ లో ఉండగా చివరికి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో చంటి కొనసాగలేక పోయారని బయటకు పంపిస్తే తాను వెళ్లిపోతానట్టు స్వయంగా చంటి నాగార్జున దగ్గర మాట్లాడారు.
ఇలా ఈయన మాట్లాడటంతో తాను బిగ్ బాస్ హౌస్ లో ఫ్లాప్ అయ్యాను అని చెప్పకనే చెప్పేశారు.ఇక ఐదో వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ చంటి అని చెప్పాలి ఆయనప్పటికీ ఈయన ఇంట్లో కొనసాగలేక హోంసిక్ అవడంతో తానే స్వయంగా బయటకు వెళ్తానని చెప్పడం వల్ల బయటకు వచ్చారని తెలుస్తోంది.
ఈ విధంగా చంటి బిగ్ బాస్ నుంచి బయటకు రాగా ప్రస్తుతం ఈయన గురించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది.చలాకి చంటి ఐదు వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు ఈయన బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎంత మేరా రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే సోషల్ మీడియా కథనాలు ప్రకారం చంటి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు ఒక్కో వారానికి సుమారుగా 1.5నుంచి రెండు లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈయన 5 వారాలకు గాను ఏడు నుంచి పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.బయట జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న చలాకీ చంటికి ఈ మొత్తంలో రెమ్యూనరేషన్ అందించారని సమాచారం.