ఉత్తర ప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేరుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి వెళ్లి ములాయం పార్దీవ దేహానికి నివాళి అర్పించారు.
అక్కడే ఉన్న ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు ఓదార్చారు.ఈ సందర్భంగా ములాయం రాజకీయ ప్రస్థానాన్ని అమిత్ షా కొనియాడారు.
ఉత్తర ప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ములాయం కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.ములాయం మృతి యూపీతో పాటు జాతీయ రాజకీయాలకు తీరని లోటేనన్నారు.
ములాయం మృతితో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదేనని అమిత్ షా పేర్కొన్నారు.