కేజిఎఫ్ 2 లో డాన్... ఈ టాలీవుడ్ నటుడికి తండ్రా?

ఇండియాలో ఇప్పుడు కేవలం ఇద్దరు డైరెక్టర్ ల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి.అందులో ఒకటి బాహుబలి లాంటి గొప్ప సినిమాను తీసి భారతీయ సినిమాను ప్రపంచం దృష్టిలో తలెత్తుకునేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మరియు కన్నడ సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజిఎఫ్ చాప్టర్ 1 మరియు 2 లకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్.

 Do You Know Balakrshna Relation With Kgf , Rajamouli, Kgf Chapter 1 , Kgf Chapter 2, Adhira, Ramika Sen, Inayat Khalil, Balakrishna, Adarsh ​​balakrishna, Tollywood-TeluguStop.com

ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు థియేటర్ లలో మంచి కలెక్షన్ లతో దూసుకు పోతున్నాయి.ఎక్కడ చూసినా ఈ రెండు సినిమా గురించి చర్చ జరుగుతోంది.

అయితే కథ పరంగా చూస్తే రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ కన్నా కేజిఎఫ్ చాప్టర్ 2 నే ప్రజల హృదయాలను గెలుచుకుంది సినీ విశ్లేషకులు అంటున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో హీరో పాత్ర రాఖీ భాయ్ ను చూపించిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.

 Do You Know Balakrshna Relation With KGF , Rajamouli, KGF Chapter 1 , KGF Chapter 2, Adhira, Ramika Sen, Inayat Khalil, Balakrishna, Adarsh ​​Balakrishna, Tollywood-కేజిఎఫ్ 2 లో డాన్#8230; ఈ టాలీవుడ్ నటుడికి తండ్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఇప్పటి వారికి ఇండియన్ సినిమాలో ఉన్న రికార్డులను చెరిపివేయడానికి మంచి ఆరంభాన్ని అందుకుంది.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం బయట బాగా వైరల్ అవుతోంది.ఇందులో నటించిన ఒక పాత్రకు మరియు తెలుగు నటుడికి ఏమైనా సంబంధం ఉందా అన్న ధోరణిలో చర్చ జరుగుతోంది.

అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఇనాయ‌త్ ఖ‌లీల్ అనే పాత్ర ఉంది.ఈ సినిమాలో అధీరా, రామిక సేన్ ల తర్వాత కీలకమైన పాత్ర ఇదే కావడం గమనార్హం.

Telugu Adhira, Balakrishna, Balakrshna Kgf, Inayat Khalil, Kgf, Kgf Chapter, Rajamouli, Ramika Sen, Tollywood-Telugu Stop Exclusive Top Stories

ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రలో చేసిన బాలకృష్ణ మన టాలీవుడ్ కు ఒక అనుబంధం ఉందని తెలుస్తోంది.తెలుగు బిగ్ బాస్, మరియు కొన్ని సినిమాలలో స్నేహితుడి పాత్ర, విలన్ పాత్రలు చేసిన తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణకు ఈయనకు రక్తసంబంధం ఉందట.అది కూడా వీరిద్దరూ తండ్రీకొడుకులు అని తెలుస్తోంది.ఈ విషయం తెలిసిన వారంతా సోషల్ మీడియాలో దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఒక నటుడిగా ఆదర్శ్ తానేంటో నిరూపించుకున్నాడు.ఇక తనయుడిని మించిన తండ్రిగా బాలకృష్ణ కూడా “కేజిఎఫ్ చాప్టర్ 2” లో అద్భుతమైన నటనతో అందరినీ మైమరిపించాడు.

దుబాయ్ లో ఉన్న డాన్ గా ఆహార్యం, హుందాతనం అన్నీ ఇతన్ని స్క్రీన్ పై సరిగా చూపెట్టాయి.ఈ సినిమాలో నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube