కన్నడ హీరోయిన్స్ మన తెలుగులోకి రావడం కొత్తేమి కాదు.కన్నడ కస్తూరిలు తెలుగు సినిమా ఇండస్ట్రీని చాల ఏళ్లుగా శాసిస్తున్నారు.
కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ఆఖరికి సీరియల్ ఇండస్ట్రీలో కూడా కన్నడ హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు.ప్రస్తుతం బుల్లితెరపై మరియు వెండితెర పై టాప్ టెన్ హీరోయిన్స్ అందరూ కూడా కన్నడ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.
ప్రస్తుతం థియేటర్ లలో సప్త సాగరాలు దాటి అనే సినిమా సందడి చేస్తుంది.చిన్నగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్టే కనిపిస్తుంది ఈ చిత్రం.
ఇక ఈ సినిమాలో చార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి ( Rakshit Shetty )హీరోగా నటిస్తే హీరోయిన్ గా రుక్మిణి వసంత్ అనే అమ్మాయి నటించింది.ఈ రక్షిత్ శెట్టి రష్మిక మందన్న మాజీ ప్రేమికుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
వీరి ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళికి ముందు బ్రేకప్ చెప్పుకున్నారు.
తెలుగు వారికి రుక్మిణి వసంత్ ( Rukmini vasanth )మొదటి సారిగా సప్త సగరాలు దాటి చిత్రం( Sapta Sagaralu Dhaati Movie ) తో పరిచయం కాక ఇప్పటి వరకు ఆమె చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా కన్నడలోనే కావడం విశేషం.ఇక రుక్మిణి వసంత్ ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య కేవలం ఐదు మాత్రమే.2019లో బీర్బల్ ట్రైలాజి కేసు 1 అనే ఒక సినిమా ద్వారా రుక్మిణి ఇండస్ట్రీకి పరిచయం కాగా, దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుని సప్త సాగరాలు దాచే ఎల్లో : సైడ్ ఎ అని సినిమా ద్వారా కన్నడలో రెండో సినిమాగా నటించింది.ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోనే ఉండగా భగీర, బానదరియల్లి, భైరతి రణగల్ అనే మూడు సినిమాలకు సంతకం చేసింది.ప్రస్తుతం ఇవన్నీ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి.
కన్నడ నుంచి ఇప్పటికే శ్రీలీల,( Sreeleela ) రష్మిక( Rashmika Mandanna ) వంటి వారు ఇండియా వ్యాప్తంగా తెలుగు నుంచి పరిచయమై స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెళుతున్నారు.వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా రుక్మిణి వసంత్ కనిపిస్తోంది.ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు.రుక్మిణి తండ్రి తండ్రి అశోక చక్ర పొందినటువంటి కల్నల్ వసంత్ వేణుగోపాల్ కావడం విశేషం.రుక్మిణి లండన్ లో తన చదువులు పూర్తి చేసి ఆ తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.1994లో పుట్టిన ఈ అమ్మడు ఈ ఏడాదిలో ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తుండడం విశేషం.