భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పురుషోత్తపట్నంలో ఆలయ భూమిపై వివాదం రాజుకుంది.ఈ క్రమంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది.
భద్రాచలం రాముల వారికి పురుషోత్తపట్నంలో భూములు ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆలయానికి చెందిన స్థలంలో గ్రామస్తులు నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆలయ అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
దీంతో దాడి చేసిన గ్రామస్తులపై ఆలయ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.