మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Director Trivikram ) అల వైకుంఠపురంలో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఆయన నుండి ఇప్పటికే రెండు మూడు సినిమా లు వస్తే బాగుండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా రాలేదు.మహేష్ బాబు తో సినిమా కు ముందు ఎన్టీఆర్ తో సినిమా ను అధికారికంగా ప్రకటించాడు.
కానీ అన్ని అనుకున్నట్లుగా జరగక పోవడం తో ఎన్టీఆర్ సినిమా ని క్యాన్సిల్ చేయడం జరిగింది.ఎన్టీఆర్ మూవీ క్యాన్సల్ అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ను అధికారికంగా మొదలు పెట్టాడు.
గుంటూరు కారం సినిమా( Guntur Karam ) అంటూ ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న త్రివిక్రమ్ తదుపరి సినిమా ని అల్లు అర్జున్( Allu Arjun ) తో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి అవ్వక పోవడం తో తదుపరి సినిమా ఎప్పుడు, ఎవరి తో అనే విషయం లో క్లారిటీ లేదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తదుపరి సినిమా విషయం లో క్లారిటీ రావాలి అంటే ఆయన గుంటూరు కారం సినిమా ని ముగించాల్సి ఉంది అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు త్రివిక్రమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.కనుక ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలియదు.ఎన్టీఆర్( NTR ) తో సినిమా ను మొదలు పెట్టి ఆ తర్వాత క్యాన్సల్ చేయడం జరిగింది.
కనుక బన్నీ తో సినిమా అయినా ఎంత వరకు వర్కౌట్ అయ్యేను తెలియదు.ఎందుకంటే ఇప్పటికే సందీప్ వంగ( Sandeep Vanga ) దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా ఒక సినిమా ని అధికారికంగా ప్రకటించారు.
కనుక త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు.మొత్తానికి త్రివిక్రమ్ తదుపరి మూవీ ఎప్పుడు అనేది తెలియాలి అంటే గుంటూరు కారం విడుదల అవ్వాల్సి ఉంది.