ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.
ఈ క్రమంలో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
వీకెండ్ తో పాటు పెరటాసి నెలతో భక్తల రద్దీ పెరిగింది.
కాగా స్వామివారిని దర్శించుకుంటున్న వారిలో ఎక్కువగా తమిళనాడుకు చెందిన భక్తులని తెలుస్తోంది.భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్స్ లు అన్నీ కిటకిటలాడుతున్నాయి.
దాదాపు ఐదు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు వేచి చూస్తున్నారు.మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.