ఎక్కడ పబ్లిసిటీ ఉంటే అక్కడ కనిపించే వర్మ( Director Ram Gopal Varma ) ఇప్పుడు ఏపీలో పెరిగిన ఎన్నికల్లో వేడిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు ప్రతి హాట్ డిబేట్ ని తన సినిమాలకు వేదికగా ఉపయోగించుకునే వర్మ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కేంద్రంగా సినిమా తీస్తానని, దాని రెండు భాగాలుగా తీసి మొదట దానికి వ్యూహం( Vyuham Movie ) అని రెండవ దానికి శపధం( Shapatham Movie ) అని పేర్లు పెడతానని చాలా కాలం క్రితమే ప్రకటించారు.ఇప్పుడు దానికి కొనసాగింపుగా మొదటి పార్ట్ వ్యూహం సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఇందులో వైఎస్ జగన్ ( CM Jagan ) మరియు ఆయన సతీమణి వైయస్ భారతి పాత్రలలో ఎవరు నటిస్తున్నారో ఆయన రివీల్ చేశారు .
ఈ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ని కార్నర్ చేస్తూ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో జగన్ గా నటించిన అజ్మల్ అమీర్నే ఈ సినిమాల్లో కూడా జగన్ పాత్రలో చూపించబోతున్నారు.ఇక వైయస్ భారతీ పాత్రలో మానస రాధాకృష్ణ నటిస్తున్నారు .తాను తీయబోయే సినిమాలలో ప్రధాన పాత్రలను ప్రతిబింబించేలా క్యారెక్టర్లు ఎంచుకోవడంలో వర్మ స్టైలే వేరు .దాదాపు ఆయన తీసిన అన్ని సినిమాలలోను నిజజీవిత పాత్రలకు దగ్గరగా ఉండే పాత్రలను రీ క్రియేట్ చేసే వర్మ ఈ సినిమాలో కూడా తన మార్క్ క్యారెక్టర్ లను పరిచయం చేశారు.
అయితే కథా పరంగాను రచనా పరంగాను నాసిరకం సినిమాలు తీస్తున్న వర్మ ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక పక్షం తీసుకున్నందున సినిమాలో చూపించే అంశాలపై నిష్పక్షపాతo ఉండదని కేవలం వైసీపీ పార్టీకి అనుకూలంగానే ఆయన వ్యవహరించబోతున్నారనే విమర్శలు మిగతా రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి.అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను అనుకున్నట్లుగానే నడిచే వర్మ ఈ సినిమాను కూడా తన ఉద్దేశాలకు అనుకూలంగానే తీసే అవకాశం ఉంది.లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దాసరి కిరణ్ సమర్పణలోని ఈ సినిమాల్లో కూడా రూపుదిద్దుకోబోతున్నాయి
.