మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100 సినిమా తో మంచి పాపులారిటీని దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి.ఈయన రామ్ గోపాల్ వర్మ.
తన గురువు కు సంబంధించిన ఇమేజ్ తరహా సినిమాలు కాకుండా మంచి కమర్షియల్ సినిమాలను చేస్తాడేమో అని మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100 సినిమాలో అందరూ అనుకునేలా చేశాడు అనడంలో సందేహం లేదు.హీరోయిన్ లను చాలా ప్రత్యేకంగా చూపించడం ఈయన స్పెషాలిటీ అని మూడు సినిమాలను చూస్తే అర్థం అవుతుంది.
మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవగా రెండో సినిమా మహా సముద్రం సినిమా( Maha Samudram ) తో నిరాశ పరిచాడు.ఆ సినిమా ఫలితం తో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, కొత్త హీరోలు ఏ ఒక్కరు కూడా ఈయన్ను నమ్మే పరిస్థితి లేదు.
దాంతో మంగళవారం అంటూ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ను చేయడం జరిగింది.
ఆ సినిమా ఫలితం పాజిటివ్ గా వచ్చింది.మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.ఇంకా అవుతూనే ఉన్నాయి.
మంగళవారం సినిమా తర్వాత అజయ్ భూపతి గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలు అయింది.ఒక మంచి దర్శకుడు మహా సముద్రం అనే ఒక తప్పుడు సినిమా ఎంపిక వల్ల చాలా సంవత్సరాలు సమయం వృదా చేసుకున్నాడు.
మంచి కమర్షియల్ సబ్జెక్ట్ లతో సినిమాలను చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం సినిమా( Mangalavaaram ) తర్వాత యంగ్ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా అజయ్ భూపతి ప్రతిభ పై నమ్మకం కనబర్చుతారు.దాంతో వారికి కథ చెప్పందుకు అజయ్ భూపతి రెడీ అవుతున్నాడు అంటూ సమాచారం అందుతోంది.అజయ్ భూపతి తదుపరి సినిమా ఏ హీరో తో ఉంటుంది.
ఎప్పుడు ఉంటుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.