వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదితో( PM Narendra Modi ) ఢిల్లీలో భేటీ అయ్యి అనంతరం ఏపీకి వచ్చేసారు.అయితే జగన్( CM Jagan ) ఏ అంశాలపై ప్రధానితో చర్చించారు అనేది ఎవరికి క్లారిటీ లేదు.
టిడిపి నేత చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం , ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లడం బిజెపి, టిడిపి , టిడిపి జనసేన పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి రావడం వంటి పరిణామాలతో జగన్ సైతం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ ఎన్నికలకు( AP Elections ) సమయం దగ్గరపడిన నేపథ్యంలో ఇలా మూడు పార్టీల కీలక నేతలు ఢిల్లీలోని కేంద్ర బిజెపి పెద్దలను విడివిడిగా కలవడం వంటివి రాజకీయంగా మరింత ఆశక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే ఏపీలో జనసేన , టిడిపి పొత్తు( Janasena TDP Alliance ) కొనసాగిస్తూ సీట్ల పంపటానికి సిద్ధమయ్యాయి.ఇప్పుడు బిజెపి కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఏపీలో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది.
మొదటి నుంచి తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ వైసీపీ చెబుతూనే వస్తుంది.
ఒకవైపు టిడిపి ,జనసేన, బిజెపి ,కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తమనే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నా, జగన్ మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఇది ఇలా ఉంటే ప్రధాని మోదీతో జగన్ ఏ అంశాలపై చర్చించి ఉంటారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకున్న ఏపీకి ప్రత్యేక హోదా తో( AP Special Status ) పాటు, విభజన చట్టంలోని హామీల పైన జగన్ చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ( Visakha Steel Privatization ) నిలుపుదల , పోలవరం ప్రాజెక్టు కు( Polavaram Project ) సంబందించిన నిధుల విడుదల వంటి కీలక అంశాలపై చర్చించినట్లుగా పేర్కొంటున్నారు.
అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్ ప్రధానితో చర్చించి ఉంటారని ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పొత్తుల వ్యవహారం పైన చర్చించి, తాము పరోక్షంగా బిజెపికి సహకరిస్తున్న విషయాన్ని గుర్తుచేసి బిజెపి పరోక్ష సహకారాన్ని జగన్ కోరి ఉంటారని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా తమను అదేపనిగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు , తన సోదరి వైఎస్ షర్మిల( YS Sharmila ) అంశాన్ని ప్రస్తావించడం బిజెపిని ఆమె టార్గెట్ చేసుకోవడం వంటి విషయాల పైన చర్చించి షర్మిల దూకుడు కు బ్రేకులు వేసే విధంగా ప్రధానితో జగన్ చర్చించి ఉంటారని అనుమానిస్తున్నారు.