తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున వ్యతిరేకతను పెంచడంలో బీజేపీ కొంత మేర విజయం సాధించినట్టే అని చెప్పవచ్చు.
అయితే యాసంగికి వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కెసీఆర్ వేసిన వ్యూహంతో ఇప్పుడు బీజేపీ అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది.అయితే కెసీఆర్ సంధించిన ఏ ప్రశ్నకు కూడా బీజేపీ నుండి ఆశించిన సమాధానం రాలేదు.
ఇక ఇదే అదునుగా రానున్న రోజుల్లో బీజేపీని ప్రజల్లో మరింతగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.ఆ దిశగా రచించిన భారీ వ్యూహ రచనను మెల్ల మెల్లగా కెసీఆర్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే వరి ధాన్యం కొనుగోలుపై సూటి ప్రశ్నలు, ధర్నా వ్యూహాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్న కెసీఆర్ చేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు బీజేపీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు.
అయితే బీజేపీ నుండి ఎటువంటి సమాధానం రాదనే విషయం కెసీఆర్ కు తెలుసు.అందుకే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగానే కెసీఆర్ బీజేపీని పెద్ద ఎత్తున ఇరుకున పెట్టుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
ఇటీవల నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరాకరించిన విషయం తెలిసిందే.

అందుకే ఇప్పుడు కెసీఆర్ ఇంతలా బీజేపీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నా సీనియర్ బీజేపీ నాయకుల నుండి ఎటువంటి మద్దతు బండి సంజయ్ కు అందడం లేదు.దీంతో బండి సంజయ్ వర్గం ఇప్పుడు కెసీఆర్ సవాల్ పై ఆచితూచి స్పందించే అవకాశం ఉంది.మరి బీజేపీ ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందనేది చూడాల్సి ఉంది.