ఒక మనిషిని అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే సాధారణ విషయం కాదు.కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఊహించని స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.
పునీత్ మరణం ఎంతోమంది అభిమానులను బాధ పెట్టింది.పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 20 రోజులైనా అభిమానులు పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కన్నడ సినీ ప్రముఖులతో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రముఖులు సైతం పునీత్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.తాజాగా బెంగళూరు నగరంలో పునీత్ సంస్మరణ సభను నిర్వహించగా ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు.
తమిళ సీనియర్ నటులలో ఒకరైన శరత్ కుమార్ పునీత్ ను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
పునీత్ కు బదులుగా తాను చనిపోయినా బాగుండేదని శరత్ కుమార్ పేర్కొన్నారు.రాజకుమార సినిమా యొక్క 100 రోజుల ఫంక్షన్ ను ఈ వేదికపైనే జరిపామని పునీత్ రాజ్ కుమార్ శ్రద్ధాంజలి కూడా ఇదే వేదికపై జరుగుతుందని తాను ఊహించలేదని శరత్ కుమార్ అన్నారు.2017 సంవత్సరంలో విడుదలైన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రి పాత్రలో శరత్ కుమార్ నటించారు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

పునీత్ గత సినిమా జేమ్స్ లో కూడా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న బంధాన్ని తలచుకుంటూ శరత్ కుమార్ బాధ పడ్డారు.ఊహించని స్థాయిలో పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను, క్రేజ్ ను పెంచుకున్నారు.
పునీత్ తో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకొని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.







