ఏజెంట్ కోసం రంగం లోకి దిగిన ధృవ

అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )హీరోగా ఏజెంట్ సినిమా( Agent movie ) వస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా రిలీజ్ లో భాగంగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్.అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

 Dhruva Entered The Arena For The Agent , Ram Charan , Akhil Akkineni , Dhruva-TeluguStop.com

ఇందులో అఖిల్‌తో పాటు రామ్ చరణ్ ( Ram Charan )కూడా కనిపించి సినిమాపై హైప్ క్రియేట్ చేయగలిగాడు.సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన ‘ఏజెంట్’ చిత్రం ఎట్టకేలకు ఈరోజు విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా ప్రమోషన్స్‌ను వినూత్నంగా నిర్వహిస్తున్న మూవీ టీమ్.

 Dhruva Entered The Arena For The Agent , Ram Charan , Akhil Akkineni , Dhruva-TeluguStop.com
Telugu Ak, Akhil Akkineni, Anil Sunkara, Dhruva, Ram Charan, Sakshi Vaidya, Sure

తాజాగా స్పెషల్ వీడియోతో అభిమానులను ఆశ్చర్యపరిచింది.అది కూడా సాదా సీదా సర్‌ప్రైజ్ అనుకుంటే పొరపాటు.ఇందుకోసం ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలో తాను పోషించిన కాప్ గెటప్‌లో ఎంట్రీ ఇవ్వడం విశేషం.

మొత్తానికి ‘వైల్డ్ సాలా’ ఏజెంట్ బిగ్ టికెట్‌ను రామ్ చరణ్‌తో లాంచ్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.బుకింగ్స్‌ ఓపెన్ అయినట్లు ప్రకటించారు.ఇక ఈ స్పెషల్ వీడియో విషయానికొస్తే.గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తాను నటించిన ‘ధృవ’ సినిమాలోని పోలీస్ క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.

తను అఖిల్‌కు ఫోన్ చేసి.‘ఏజెంట్ ఎక్కడువన్నావ్’ అంటే దగ్గరలోనే ఉన్నానని సమాధానం వస్తుంది.

అందరూ నీ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నారు.నువ్వు సిద్ధమేనా? అని అడిగితే.

Telugu Ak, Akhil Akkineni, Anil Sunkara, Dhruva, Ram Charan, Sakshi Vaidya, Sure

ఇది నా వైల్డెస్ట్ మిషన్, నేను రెడీ అని బదులిస్తాడు ఏజెంట్.ఇక ధ్రువ.‘లెట్స్ బిగిన్ ది వైల్డ్ రైడ్’ అంటూ థియేటర్లలో ఏజెంట్ బిగ్ టికెట్ ఓపెనింగ్స్ ప్రారంభించాడు.కాగా ఈ వీడియో చూసిన అక్కినేని, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అలాగే రామ్ చరణ్ స్పెషల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన అఖిల్.‘బిగ్ టికెట్ లాంచ్ చేసేందుకు ఇంతకంటే వైల్డర్ వే గురించి ఆలోచించలేకపోయాను… థాంక్యూ మై బ్రదర్.

ఇది నాకు చాలా ప్రత్యేకమైంది’ అంటూ రామ్ చరణ్‌కు ట్యాగ్ చేశాడు.ఈరోజు ఏజెంట్ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది.

ఇదిలా ఉంటే.అఖిల్‌, రామ్‌ చరణ్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని తెలిసిందే.

Telugu Ak, Akhil Akkineni, Anil Sunkara, Dhruva, Ram Charan, Sakshi Vaidya, Sure

ఇటీవల ఏజెంట్ ప్రమోషన్స్ సందర్భంగా అఖిల్.చరణ్‌తో తనకున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ.చరణ్‌తో తన బాండింగ్ ఫ్రెండ్‌షిప్ కంటే మించిందని తెలిపాడు.తన క్లోజ్ ఫ్రెండ్స్‌లో కొంతమంది చాలా స్పెషల్ అని.వారిలో చరణ్ ముందుంటాడని చెప్పుకొచ్చాడు.ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ( Anil Sunkara ,AK Entertainments banner )నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ పాత్రలో నటించాడు.కోలీవుడ్ స్టార్ కంపోజర్ హిప్ హాప్ తమన్ మ్యూజిక్ అందించిన చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్‌ సినిమాను తలపించడం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube