తిరుమల తరహాలోనే కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.కాణిపాక ఆలయంలో మహా కుంభాభిషేకం కోసం కేంద్రం నుంచి రూ.30 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరామని చెప్పారు.ఈ విషయంపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
నిత్యాన్నదాన సత్రంలో ఇకపై భక్తులకు అరటి ఆకులోనే భోజనాలు పెడతామని పేర్కొన్నారు.కాణిపాక పుష్కరిణి నీటి శుద్ధి కోసం పిల్టర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఆలయ ఉద్యోగి బంగారు ఆభరణాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజుల తర్వాత ఖజానాకు జమ చేసిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు.ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.