ప్రమాదానికి గురైన దీప్తి సునయన.. అసలేం జరిగిందంటే?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దీప్తి సునయన( Deepti Sunayana ) ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Deepthi Sunaina React On Accident Rumours , Deepthi Sunaina, Bigg Boss, Accident-TeluguStop.com

ఇలా యూట్యూబర్ గా సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బిగ్ బాస్ అందుకున్నారు.

బిగ్ బాస్( Big Boss ) కంటెస్టెంట్ గా దీప్తి అక్కడ హీరో తనీష్ తో కాస్త వెళ్లి పులిహోర వేషాలు వేస్తూ మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ఈమె ఈ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి తన వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ వీడియోలతో ఎంతో బిజీ అయ్యారు ఈ క్రమంలోనే మరొక యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్( Shanmukh Jaswanth )తో ప్రేమలో పడ్డారు.ప్రస్తుతం వీరిద్దరికీ బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే.ఇలా యూట్యూబర్ గా కొనసాగుతున్నటువంటి దీప్తి సునయన ప్రమాదానికి గురైంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.

దీంతో అభిమానులు తనకు ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా తనకు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా ఈమె స్పందించారు.ఈ సందర్భంగా దీప్తి సునయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనకు ప్రమాదం జరిగింది అని వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని అది పూర్తిగా ఆవాస్తవమేనని తెలియజేశారు.కొన్నాళ్ల క్రితం అలియా ఖాన్‌ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసినట్లు చెప్పుకువచ్చింది.

అందులోనే క్లిప్స్ ఆధారంగా తాను ప్రమాదానికి గురయ్యాను అంటూ వార్తలను సృష్టించారని ఇందులో ఏ మాత్రం నిజం లేదు అంటూ ఈ సందర్భంగా దీప్తి క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube