బాలీవుడ్ మరియు హాలీవుడ్ రెండింటిలోనూ నటిస్తూ అలరిస్తున్న తార దీపికా పదుకొణె.( Deepika Padukone ) ఈ ముద్దుగుమ్మ తన ప్రతిభ, అందంతో చాలామందిని అభిమానులను చేసుకుంది.
అయితే ఆమె సినిమా లైఫ్ ఎంతగా హాట్ టాపిక్ అవుతుందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే చర్చినీయాంశమవుతుంది.బాలీవుడ్ హార్ట్‌త్రోబ్ రణ్‌వీర్ సింగ్‌ను( Ranveer Singh ) దీపికా పెళ్లి చేసుకోకముందు ఏడు మందితో ఆఫర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.వారెవరో తెలుసుకుందాం పదండి.
1.నిహార్ పాండ్యా:
ముంబై వ్యాపారవేత్త నిహార్ పాండ్యాతో( Nihar Pandya ) దీపిక అఫైర్ పెట్టుకుంది.విడిపోవడానికి ముందు వారు మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారు.నిహార్ ఆ తర్వాత సింగర్ నీతి మోహన్‌ని పెళ్లాడాడు.
2.ఎంఎస్ ధోనీ
క్రికెటర్ ఎంఎస్ ధోనీతో( MS Dhoni ) దీపిక డేటింగ్ చేస్తోందని పుకార్లు షికార్లు చేశాయి.ఆమె బహిరంగంగా ధోనీ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ, వారి మధ్య రిలేషన్‌షిప్ ఉన్నట్లు తెలియ రాలేదు.యువరాజ్ సింగ్, ధోనీలతో దీపిక లవ్ ట్రయాంగిల్ నడిపిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
3.యువరాజ్ సింగ్:
క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో( Yuvraj Singh ) దీపికకు రొమాంటిక్ కనెక్షన్ ఉండేదని ప్రచారం సాగింది.అయితే, వారి బిజీ షెడ్యూల్ చివరికి వారు విడిపోవడానికి దారితీసింది.ఆ తర్వాత యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ గురించి మాట్లాడాడు.
4.ఉపేన్ పటేల్:
దీపికా, మోడల్-యాక్టర్ ఉపేన్ పటేల్( Upen Patel ) ఫోటో షూట్ వారి మధ్య ఏదో ఉందన్న పుకార్లకు ఆజ్యం పోసింది.ఈ చిత్రాలు వారిని జంటగా చిత్రీకరిస్తూ అభిమానులలో ఊహాగానాలకు దారితీశాయి.
5.ముజామిల్ ఇబ్రహీం:
కశ్మీరీ మోడల్-కమ్-యాక్టర్ ముజామిల్ ఇబ్రహీం ( Muzammil Ibrahim ) దీపికతో సంబంధం ఉన్న మరొక వ్యక్తి.2007 ఇంటర్వ్యూలో, ఇబ్రహీం తన గత సంబంధాల గురించి, నటితో తనకున్న అనుబంధం గురించి నిజాయితీగా చర్చించాడు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీపిక ప్రధాన పాత్ర పోషించినందున అతను “యే జవానీ హై దీవానీ” చిత్రంలో ఒక పాత్రను తిరస్కరించాడు.
6.సిద్ధార్థ్ మాల్యా:
దీపిక తన బాలీవుడ్ అరంగేట్రం సమయంలో వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో( Siddharth Mallya ) డేటింగ్ చేసింది.ముఖ్యంగా IPL మ్యాచ్‌లో వారి మధ్య ముద్దు సన్నివేశం బాగా హైలైట్ అయింది.
7.రణబీర్ కపూర్:
దీపికా ప్రేమ జీవితంలో రణ్‌బీర్ కపూర్ చాలా ముఖ్యమైనవాడు.వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు.అతనిపై తనకున్న ప్రేమకు చిహ్నంగా దీపిక మెడపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది.అయితే, వారు రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2009లో విడిపోయారు.