యూఎస్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇండియన్ స్టూడెంట్ శవం.. అసలు ఏమైంది?

యూఎస్‌లో( US ) ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.ప్రస్తుతం ఆ దేశంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి.

 Dead Body Of Indian Student On Us University Campus What Actually Happened , Aku-TeluguStop.com

ఈ సమయంలో సరైన ప్రొటెక్షన్ లేకుండా బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం.అయితే ఏమవుతుందిలే అని ఒక ఇండియన్ స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళాడు.

ఆ చలి వల్ల అతని శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన చివరికి మరణించాడు.ఈ విషాద వార్త యూనివర్సిటీతో పాటు తల్లిదండ్రులలో ఎంతో దుఃఖాన్ని నింపింది.

మరణించిన ఆ విద్యార్థి పేరు అకుల్ ధావన్( Akul Dhawan ).అతనికి 18 సంవత్సరాలు.ఇల్లినాయిస్ యూనివర్సిటీలో( University of Illinois ) చదువుకున్నాడు.శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన అతడు తిరిగి గదికి రాలేదు.శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అతడి స్నేహితులకు సంబంధాలు తెగిపోయాయి.వారు అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించారు, కానీ సమాధానం ఇవ్వలేదు.

బయట చలి ఎక్కువగా ఉండడం, కోటు లేకపోవడంతో ఆందోళన చెందారు.పోలీసులకు ఫోన్ చేసి అతని కోసం వెతకాలని కోరారు.

Telugu Akul Dhawan, Hypothermia, Illinois-Telugu NRI

శనివారం ఉదయం 11 గంటల వరకు పోలీసులకు ఆచూకీ లభించలేదు.అతను చివరిగా కనిపించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న భవనం వెనుక వరండాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వారు చూసే సరికి అప్పటికే చనిపోయాడు.అతడికి ఏమైందని పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇది ప్రమాదమే తప్ప నేరం కాదని వారు భావిస్తున్నారు.అకుల్ అల్పోష్ణస్థితితో మరణించి ఉండవచ్చు, అంటే అతని శరీరం చాలా చల్లగా తయారయ్యి హార్ట్ బీట్‌ ఆపేసినట్లుంది.

అతడిపై ఎలాంటి ఇతర గాయాలు కనిపించలేదు.

Telugu Akul Dhawan, Hypothermia, Illinois-Telugu NRI

అకుల్ మృతిపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఓ ప్రకటన విడుదల చేసింది.ఆ ప్రకటనలో మృతుడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలిపారు.ఎవరికైనా అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ అందించి ఆదుకుంటామని కూడా చెప్పారు.

పోలీసులు అతడిని త్వరగా ఎందుకు కనిపెట్టలేదో చెప్పాలని మృతుడి తల్లిదండ్రులు కోరారు.సెర్చ్ అండ్ రెస్క్యూ విధానాల గురించి యూనివర్సిటీని కూడా నిలదీశారు.

పోలీసులు ప్రజల నుంచి సహాయం కోరుతున్నారు.ఆయన మృతిపై ఎవరికైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

వారు రెండు ఫోన్ నంబర్లు ఇచ్చారు.యూనివర్సిటీ పోలీసులకు 217-333-1216, క్రైమ్ స్టాపర్స్ కోసం 217-373-8477.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube