హైదరాబాద్లోని మరో ప్రాంతంలో ప్రధాన రహదారి కుంగింది.చాదర్ ఘాట్ లో రోడ్డుపై గొయ్యి ఏర్పడింది.
రోడ్డు కింద 20 ఫీట్ల లోతు వరకు డ్రైనేజీ నిర్మాణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రధాన రహదారి కుంగడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యి చుట్టూ రక్షణగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వాహనదారులకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఇటీవలే సిటీలోని రెండు ప్రాంతాల్లో రోడ్లు కుంగిన విషయం తెలిసిందే.