ఇళ్లు లేని పేదలకు సీఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది.వీరందరికీ అమరావతిలో ఇంటి పట్టాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.
న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు.
ఈ మేరకు అమరావతిలో పేదలు అందరికీ ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.ఇందులో భాగంగా అమరావతిలో 1134.58 ఎకరాలను పేదల ఇళ్ల కోసం కేటాయించారు.గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది ప్రభుత్వం.