మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై ప్రజా ప్రజాప్రతినిధుల కోర్టు అసహనం వ్యక్తం చేసింది.మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సహా పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.అదేవిధంగా నాలుగు గంటల సమయంలోగా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని ప్రజాప్రతినిధుల కోర్టు హెచ్చరించింది.