అన్నదమ్ముల మధ్య కరోనా చిచ్చు,తమ్ముడిహత్య

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రాణాలు బలిగొంటున్న విషయం తెలిసిందే.ఒకపక్క ఈ మహమ్మారి సృష్టిస్తున్న భీభత్సం తో పాటు అక్కడక్కడ చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.

 Mumbai Man Allegedly Kills Brother Over Stepping Out During Covid-19 Lockdown, C-TeluguStop.com

ఈ కరోనా మహమ్మారి కి భయపడిపోయిన జనాలు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వారికే అర్ధం కానీ పరిస్థితి ఏర్పడుతుంది.మొన్నటికి మొన్న కట్టుకున్న భార్యకు కరోనా సోకింది అని బిడ్డతో సహా భార్యను కూడా ఇంటినుంచి తరిమేసిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇంకా ఆ ఘటన మరువకముందే అన్నదమ్ముల మధ్య కరోనా చిచ్చు పెట్టింది.చిన్న గొడవ పెరిగి పెరిగి తమ్ముడి ప్రాణం బలిగొంది.

ఈ ఘటన ముంబై లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే….

ముంబై నగర పరిధిలోని కందివాలికి చెందిన రాజేష్ లక్ష్మి ఠాకూర్, దుర్గేష్ అన్నదమ్ములు.దుర్గేష్ పూణెలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్ కారణంగా కందివాలిలోని తన ఇంటికి వచ్చాడు.అయితే బుధవారం మధ్యాహ్నాం సమయంలో దుర్గేష్ కిరాణ సామగ్రి తేచ్చేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు.

దీంతో దుర్గేష్‌పై లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లావని, అన్న రాజేష్‌తో పాటు అతడి భార్య అగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడం? అవసరమా అని ఇద్దరూ ప్రశ్నించారు.దీంతో అన్నదమ్ముల మధ్య మాటమాట పెరగడం తో దుర్గేశ్‌ తన వదినను చెంపపై కొట్టాడు.దీనితో కోపంతో ఊగిపోయిన రాజేశ్‌.కిచెన్‌ కత్తితో దుర్గేశ్‌ను పొడిచాడు.తీవ్రంగా గాయపడిన దుర్గేష్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే దుర్గేష్ మృతిచెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు.

దీనితో సమాచారం అందుకున్న పోలీసులు అన్న రాజేష్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube