సినిమా ఇండస్ట్రీలో మంచికి స్థానం లేదు.ఎవరైనా సరే సమయానికి అనుకూలంగా వ్యవహరిస్తేనే అక్కడ నెగ్గ గలుగుతారు.
అంతేకానీ తాను చెప్పిందే వినాలి అని మొండికేసి కూర్చుంటే అభాసు పాలు అవ్వక తప్పదు.సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు హీరో ఆకాష్.
తెలుగు లో ఆనందం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించిన తర్వాత ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు ఆకాష్.పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు అందుకే నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశాడు.అతడికి సినిమా తప్ప మరొక ప్రపంచం తెలీదు.
దర్శకత్వం కూడా చేశాడు.
ఎన్ని చేసినా ఆకాష్ మాత్రం ఒక స్టార్ సెలబ్రెటీగా ఎదగలేకపోయాడు.అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
ఎల్లప్పుడూ తాను మాత్రమే గొప్ప అని అనుకునే ఆకాష్ తన చుట్టూ ఏం జరుగుతోంది, ప్రపంచం ఎలా అప్డేట్ అవుతోంది అనే విషయాలను గ్రహించలేకపోతుంటాడు.అందుకే ఆకాష్ తీసిన ఏ సినిమా కూడా విజయవంతం కాలేదు.
పైగా ప్రతి సినిమాకి ఏదో ఒక కాంట్రవర్సీ కూడా అతనిని సినిమా ఇండస్ట్రీకి పనికిరానివాడిగా చేసింది.
తెలుగులో కమెడియన్ సునీల్ హీరోగా మారుతూ చేసిన అందాల రాముడు సినిమాలో ఒక పాత్రలో నటించాడు ఆకాష్.ఆ సినిమాకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు ఆ మధ్యకాలంలో.ఇక మన తెలుగు అమ్మాయి అయినా సునయన నీ తమిళ్ లో ఇంట్రడ్యూస్ చేశాడు.
కదలిల్ విజ్హున్తేన్ అనే చిత్రం కోసం సునయనని పరిచయం చేయడంతో ఆ సినిమా ఘనవిజయం సాధించింది.
అయితే ఆ చిత్రం తర్వాత మాదన్ అనే ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు ఆకాష్. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది.మళ్ళీ కొన్ని రోజులకి మొదలు పెట్టిన సునయనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే చేస్తానని చెప్పింది.
దీంతో ఇది పెద్ద గొడవగా మారింది.ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆకాష్ సునయనపై కేసు కూడా వేశాడు.
చిలికి చిలికి గాలి వానగా మారింది.తాను పరిచయం చేశాను అనే కృతజ్ఞత కూడా లేకుండా తనని డబ్బులు డిమాండ్ చేయడం పట్ల ఆకాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.