ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా వాడుకుంటూ కమీషన్లు దోచుకుంటున్నారని గతంలోనే మోదీ బహిరంగంగానే ఆరోపించారు.
ఆ మాటలు ఆరోపణలు కాదు నిజాలని మరోసారి రుజువైనట్లు తెలుస్తోంది.ఇందుకు కారణం దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్యాఖ్యలేనని అర్థం అవుతుందని పలువురు అంటున్నారు.
చంద్రబాబు రాత్రిపూట టార్చ్ లైట్ పట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం వేధించేవాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే మరోవైపు మాత్రం చంద్రబాబు మాత్రం తాను నిప్పునని, తన మీద ఒక్క ఆరోపణ కూడా లేదంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని ఈ క్రమంలో తనను ప్రశ్నించే చట్టాలే లేవంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని ఏపీలోని కొందరు వ్యక్తులు అంటున్నారు.చంద్రబాబు నిజాయితీ సైతం నేతిబీర చందమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తనకు నచ్చిన వాళ్లకు, అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.
దానికి ప్రతిఫలంగా వారి నుంచి వేల కోట్లలో కమీషన్లు నొక్కేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే అమరావతి కాంట్రాక్టర్‌లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పిసిఎల్), ఎల్&టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయాలు ఐటీ సంస్థలు నిర్వహించిన సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్టజెప్పినట్లు షాపూర్జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం.
అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
అయితే 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారట.దాంతో మనోజ్.చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు.ఈ క్రమంలోనే షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది.
ఈ క్రమంలోనే బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారని తెలుస్తోంది.
ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందే.ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించారు.దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగస్ట్ 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించిందని సమాచారం.దీంతో తన బండారం బయటపడుతుందని భయపడిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోందంటూ వార్తలు జోరందుకున్నాయి.
ఏదీ ఏమైనా చంద్రబాబు అక్రమాలు, అవినీతి గుర్తించిన ఏపీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరని తెలుస్తోంది.ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచికే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని ప్రతి పేదవానికి అండగా నిలుస్తున్న వైసీపీకే ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని అర్థం అవుతుంది.