వైసీపీ మంత్రి రోజాకు( YCP Minister Roja ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా రోజా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.
నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సొంతమవుతుందనే నమ్మకంతో ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ దక్కడం కూడా సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నగరి నియోజకవర్గంలో పరిస్థితులు రోజాకు వ్యతిరేకంగా ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.చాలామంది వైసీపీ నేతలు( YCP leaders ) గతంలో రోజా గెలుపు కోసం కష్టపడగా ఈసారి మాత్రం రోజా ఓటమి కోసం కష్టపడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
కేజే శాంతి, అమ్ములు, మురళి రెడ్డి, రాజు, చక్రపాణిరెడ్డి రోజాకు వ్యతిరేకంగా పని చేయడంతో పాటు నగరిలో రోజా కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు చెక్ పెట్టే విషయంలో రోజా ఫెయిల్ అవుతున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.తాజాగా జగన్( jagan ) నగరికి వచ్చిన సమయంలో రోజా ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఉన్నాయంటే రోజాపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో సులువుగానే అర్థమవుతుంది.సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాను గెలిపించాలని మాట వరసకు కూడా జగన్ కామెంట్ చేయకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

రోజా, కేజే శాంతిలను ( KJ Shanti )కలపాలని జగన్ ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నం సైతం విఫలమైంది.రోజా ఇతర నేతలతో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రోజాకు టికెట్ ఇచ్చినా ఓడించడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారని తెలుస్తోంది.తనకు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రోజా అడుగులు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
రోజా పొలిటికల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.







