మాటల తూటాలకు పదునుపెట్టిన జానా... ప్రజల మనసు గెలిచేనా?

తెలంగాణలో నాగార్జున ఉప ఎన్నిక సమరం రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

 Congress Leader Jana Reddy Speed In Campaign, Congress Leader Jana Reddy , Nagar-TeluguStop.com

ఇప్పటికే టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను దించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి మంచి ఊపులో ఉన్న టీఆర్ఎస్ ఈ నాగార్జున సాగర్ ఎన్నిక విజయంపై కన్నేసింది.

అయితే ఇప్పటివరకు 7 సార్లు గెలిచిన నేతగా జానారెడ్డికి మంచి రికార్డు ఉంది.అయితే కేసీఆర్ హవాలో ప్రత్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు.

అయితే ఇప్పుడు ఆయన మృతితో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.ఇప్పుడు జానారెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.

కాంగ్రెస్ నేతలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇక పోలింగ్ కు దగ్గరపడుతున్న తరుణంలో జానా మాటల తూటాలకు పదునుపెడుతున్నారు.

అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన జానారెడ్డి మరి ఈ సారి ప్రజల మనసులను గెలుస్తారా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.కాని కాంగ్రెస్ నాయకుల నుండి సరైన మద్దతు దొరకకపోవడం జానాకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

త్వరలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో జానా ప్రచారం గనుక పకడ్భందీగా ఉండకపోతే మొత్తం ప్రజల దృష్టి టీఆర్ఎస్ వైపు పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube