గత కొద్ది రోజులుగా….సినీ కమెడియన్ అలీ ప్రస్తావన తరుచూ వార్తల్లోకి వస్తుంది.
ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా అందరిని సస్పెన్స్ కి గురి చేస్తూ….అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ… అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
మొన్నామధ్య వైసీపీ అధినేతను కలవగా … ఆ తరువాత చంద్రబాబు నాయుడుని కలిసి చర్చలు జరిపారు.అలాగే నిన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ని కలిశారు.
ఆయన టీడీపీ తరపున గుంటూరు టికెట్ ఆశిస్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.
అయితే… ఈ రోజు తన మిత్రుడైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు.జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు.ఆలీని వెంటబెట్టుకుని అమరావతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.
వైసీపీలో ఈ నెల 9వ తేదీన ఆలీ చేరబోతున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ను కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తన స్నేహితుడు, గురువు, మార్గదర్శకుడిగా పవన్‌ను చెప్పుకునే అలీ.ఆయన సలహాలు తీసుకునేందుకే వచ్చారని తెలుస్తోంది.దాదాపు 2 గంటలపాటు పాటు వీరి భేటీ కొనసాగింది.
అయితే వారిద్దరూ ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.