ఇకపై ఏపీలో 25 జిల్లాలు...అంటూ....

వైసీపీ అధినేత జగన్ సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా… శ్రీకాకుళం జిల్లా … ఇచ్ఛాపురం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.ఈ సందర్భంగా అనేక హామీలను ఆయన ప్రకటించారు.25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని ప్రకటించారు.తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తానని తెలిపారు.

 Ap Will Be Built With 25 Districts Says Ys Jagan-TeluguStop.com

ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామన్న జగన్… 25 జిల్లాలతో నవ్యాంధ్ర నిర్మిస్తామన్నారు.

అంతే కాకుండా… కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గర చేస్తామని వెల్లడించిన ఆయన… గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం… ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకొస్తాం.మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగ అవకాశం ఇస్తామని ప్రకటించారు.ప్రతీ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి వెళ్లేలా చేస్తామన్న వైఎస్ జగన్… ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్‌ ను నియమిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube