ఆంధ్ర ప్రీమియర్ లీగ్( Andhra Premier League ) టీ20 టోర్నీ రెండవ సీజన్ తుదిదశకు చేరుకుంది.కోస్టల్ రైడర్స్-రాయలసీమ కింగ్స్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
లీగ్ దశలో కోస్టల్ రైడర్స్( Coastal Riders ) అగ్రస్థానంలో ఉండడం వల్ల నేరుగా ఫైనల్ కు చేరింది.
గోదావరి టైటాన్స్-ఉత్తరాంధ్ర లయన్స్ మధ్య శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ విజయం సాధించింది.నేడు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో రాయలసీమ కింగ్స్ తో( Rayalaseema Kings ) గోదావరి టైటాన్స్ తలపడనుంది.క్వాలిఫయర్-2 మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో కోస్టల్ రైడర్ తో తలపడనుంది.
తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.లీగ్ పాయింట్ల పట్టికలో రన్ రేట్ కారణంగా వెనుక పడిన కూడా.హెడ్ ఆన్స్ లో విజయంతో ఎలిమినేటర్ మ్యాచ్ కు అర్హత సాధించిన గోదావరి టైటాన్స్( Godavari Titans ) విజయమే లక్ష్యంగా లయన్స్ ను వేటాడి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2 మ్యాచ్ కు అర్హత సాధించింది.
ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ ఓడిన ఉత్తరాంధ్ర లయన్స్( Uttarandhra Lions ) మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగులను నమోదు చేసింది.ఉత్తరాంధ్ర లయన్స్ బ్యాటర్లైన గుల్ఫమ్ 49, భరత్ 37 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేయలేకపోయారు.
గోదావరి టైటాన్స్ బౌలర్లు శశికాంత్, సమన్విత్ చెరో మూడు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన గోదావరి టైటాన్స్ జట్టు మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడింది.
ఓపెనర్ జ్ఞానేశ్వర్ కు హేమంత్ రెడ్డి తోడు కావడంతో రెండో వికెట్ కు 100 పరుగులను జోడించారు.ఇక మూడవ వికెట్ కు 153 పరుగులను చేశారు.
ఇక 18 ఓవర్లలోనే మూడు వికెట్లను కోల్పోయి 159 పరుగులు చేసి గోదావరి టైటాన్స్ విజయం సాధించింది.