మూత్రంలో మంటగా అనిపిస్తుందా.. వర్రీ వద్దు ఉల్లితో ఇలా చెక్ పెట్టండి!

మూత్రంలో మంట( Burning urine ).చాలా మంది సర్వ సాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

 Super Effective Remedies To Get Rid Of Burning Urination! Burning Urination, Hom-TeluguStop.com

మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం వల్ల తీవ్రమైన బాధ కు లోనవుతారు.ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది.

ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య చాలా అధికం.అయితే మూత్రంలో మంటను నిర్లక్ష్యం చేయకుండా మొదట్లోనే శ్రద్ధ పెడితే నివారించుకోవడం సులభం అవుతుంది.

ఎక్కువ శాతం మంది మూత్రంలో మంట తగ్గడానికి మందులు వాడుతుంటారు.కానీ కొన్ని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మూత్రంలో మంట కు చెక్ పెట్టడానికి ఉల్లి( Onion ) అద్భుతంగా సహాయపడుతుంది.ఉల్లి లో ఉండే పలు సుగుణాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తుంది.

అదే సమయంలో మూత్రంలో మంటను దూరం చేస్తుంది.అందుకోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ పెరుగు( Curd )ను తీసుకుని అందులో ఉల్లిపాయ పేస్ట్ ను కలిపి తినాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మూత్రంలో మంట అన్న మాటే అనరు.అలాగే మూత్ర విసర్జన సమయంలో బర్నింగ్ సెన్సేషన్ ఉన్నవారికి ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూడా అద్భుతంగా సహాయపడుతుంది.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ) వన్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి .

Telugu Tips, Latest-Telugu Health

ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని తాగాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే మూత్రంలో మంట దెబ్బకు తగ్గిపోతుంది.ఇక ఈ టిప్స్ తో పాటు పరిశుభ్రత ఎంతో ముఖ్యం.

బాత్రూమ్ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోండి.అలాగే శరీరానికి అవసరమయ్యే వాటర్ ని అందించండి.

మద్యపానం, ధూమపానం అలవాట్లను వదులుకోండి.మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోండి.

తద్వారా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు దూరం అవ్వడమే కాదు మూత్రంలో మంట సైతం త‌గ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube