ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అన్న చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుకలు జగన్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు జగన్ కు సిగ్గు అనిపించడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,441 కోట్లు ఖర్చు చేశామన్న ఆయన వైసీపీ హయాంలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని విమర్శించారు.తెలుగు గంగ కోసం తాము రూ.504 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ సర్కార్ రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు.వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు.
రాయలసీమకు నీళ్లు ఇస్తే రతనాల సీమగా మారుతుందని తెలిపారు.ఏపీ వ్యాప్తంగా 198 ప్రాజెక్టులు, రాయలసీమలో 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేశారన్నారు.
మరో ఐదేళ్ల వరకు టెండర్లు పిలవొద్దని జీవో జారీ చేస్తారా అని ప్రశ్నించారు.ఇంతటి దారుణానికి పాల్పడిన జగన్ రాయలసీమ ద్రోహి కాదా అని నిలదీశారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి రాగానే సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.దాంతో పాటు ప్రీ క్లోజర్ చేసిన 102 ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.
రాయలసీమకు,యువతకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.